ఓవైపు వరి కోతలు.. మరోవైపు నారు మడులు | - | Sakshi
Sakshi News home page

ఓవైపు వరి కోతలు.. మరోవైపు నారు మడులు

Nov 1 2026 7:31 AM | Updated on Nov 1 2026 7:31 AM

నందిపేట్‌(ఆర్మూర్‌): ఖరీఫ్‌ సీజన్‌ వరి కోతలు ఓ వైపు కొనసాగుతుండగానే.. మరో వైపు రబీ సీజన్‌ నాట్ల కోసం రైతులు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. నందిపేట మండలంలో ఇంకా 50 శాతం పంట కోతలు పూర్తి కావాల్సి ఉండగా, సు మారు పది రోజుల క్రితం నుంచే విత్తనాలు అలుకుతున్నారు. పంట పంటకు మధ్య తప్పకుండా మ డుల తడి ఆరే వరకు మరో పంట పనులు మొదలు పెట్టొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎల్‌ నినో ప్రభావం కారణంగా వరి సాగు చేయొద్దని, ఆరుతడి పంటలు వేయాలని ప్రభు త్వం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ రైతులు నా రుమడులను సిద్ధం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే నారు మొలకెత్తింది. ముందస్తుగా నాట్లు వేసి నీటి ఎద్దడిని అధిగమించాలనే ఆలోచనతో రైతులు వరినారు పోసి ముందుకు వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement