నిజామాబాద్ రూరల్: ఢిల్లీలో ఇటీవల ముస్లిం మ హిళా జర్నలిస్టులపై పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం సరికాదని నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు అన్నారు. జాతీయ జర్నలిస్ట్ సంఘాల పిలుపుమేరకు సోమవారం దాడిని ఖండిస్తూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్య క్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధ్యులపై శాఖామైన చర్యలు చేపట్టి వారిని విధుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీ, అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు శ్రీకాంత్, సుభాష్, రాజ్‌కుమార్, రాజు, భా స్కర్ గౌడ్, స్వా మి, ప్రీతంరెడ్డి, రవిచరణ్ రెడ్డి, రత న్ రెడ్డి, వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఉన్నారు.


