నిజామాబాద్ రూరల్: ఎరువుల రవాణా ఖర్చును ప్రభుత్వమే భరించాలని జిల్లా ప్రైమరీ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు సోమవారం నగరంలోని కలెక్టరేట్‌కు తరలివచ్చి, అదనపు కల్టెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. అ నంతరం అధ్యక్షుడు ఎ్‌స్‌కే బాబా మాట్లాడుతూ.. ఎరువుల రవాణా భారం సొసైటీల మీద పడటంతో ఆర్థికంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి రవాణా, హమాలీ చార్జీలు అదనంగా వసూలు చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ ప్రతినిధులు నర్సయ్య, మహమ్మద్ పాషా, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


