నమోదు తప్పనిసరి
● వీసీలో డీజీపీ సీవీ ఆనంద్
నిజామాబాద్‌అర్బన్: గణేశ్ మండపాల వివరాలను పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. వినాయక ఉత్సవాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ప్రతి మండపం వద్ద భద్రతను ముందుగానే పరిశీలించాలన్నారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని, నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీపీ సాయిచైతన్య, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఏఆర్ ఏసీపీ రాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


