న్యూస్‌రీల్
పులుల సంరక్షణ..
పులుల సంరక్షణతోపాటు ఆవాసాల సంరక్ష ణ అందరి బాధ్యత అని కవ్వాల్ టైగర్ రిజ ర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం అన్నారు.
మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
– 8లో u
రాజకీయం గరంగరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పాలనలో ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని దాటగా.. మూడు ప్రధాన పార్టీలు తమ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని, ఇవిగో వైఫల్యాలు అంటూ ‘బాకీ కార్డు’లతో బీఆర్‌ఎస్ వారం రోజులుగా ‘పోరుబాట’ పట్టింది. నిరసన కార్యక్రమాలను ఉధృతంగా చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్ తమ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు మైలురాయిగా ‘ప్రజాపాలన విజయోత్సవ’ ర్యాలీలను నిర్వహిస్తోంది. ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఎడతెగని నిరసనలతో గులాబీ పోరు..
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అమలుకానీ హామీలను ఎత్తిచూపుతూ, వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ నిరసనల పర్వాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్‌బాకీ కార్డుల పంపిణీ, వైఫల్యాలపై ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, ప్రజావాణిలో వినతుల కార్యక్రమాలను చేపట్టింది. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, షకీల్ క్షేత్రస్థాయిలో చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారు. ఈనెల 2న ప్రారంభించిన కార్యక్రమాలు 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సోమవారం జిల్లాలో చేపట్టిన నిరసనల సందర్భంగా సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంగళవారం సైతం బీఆర్‌ఎస్ నేతలు జిల్లాకేంద్రంతోపా టు మండలాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రా లు సమర్పించి ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేయనున్నారు. 10వ తేదీన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు సంఘీభావం తెలుపనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు బీఆర్‌ఎస్ వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూనే పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణుల సమీకరణతో బలప్రదర్శన చూపుతోంది.
ఫీజు బకాయిలపై ‘బీజేపీ లడాయి’
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ పోరు చేపట్టింది. ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో నిరసనలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలపై జిల్లాకేంద్రంలో విద్యార్థులతో ధర్నా కార్య క్రమాన్ని చేపట్టగా, 22 ఏ భూములపై నిరసనలకు సిద్ధమైంది. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, ముఖ్య నేతల ఆధ్వర్యంలో నిరసనల పర్వాన్ని కొనసాగించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సమీకరించి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందించింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నా అప్పుడే పార్టీల నడుమ హోరాహోరు పోరు మొదలైంది. ప్రభుత్వ వెయ్యి రోజులపాలన కేంద్రంగా మూడు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగడంతో రాజకీయ వాతావరణం గరం అయ్యింది.
వెయ్యి రోజుల పండగతో చేరువయ్యేలా..
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన మైలురాయిని అభివృద్ధిమంత్రంతో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలను చేపట్టింది. జిల్లాకేంద్రంతోపాటు మండలాలు, నియోజకవర్గకేంద్రాల్లో బైక్ ర్యాలీ లు, కార్నర్ మీటింగ్‌లను నిర్వహిస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులు, కార్యకర్తలను సమీకరించి ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని ఉధృతం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌ డ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకా లను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలను చేపట్టింది. రైతులు, మహిళలు, యు వ త, విద్యార్థులే లక్ష్యంగా ప్రభుత్వ పథకాల ప్రచారానికి క్షేత్రస్థాయిలో నేతలు రంగంలోకి దిగారు.
జిల్లాలో పోటాపోటీగా కాంగ్రెస్,
బీఆర్‌ఎస్, బీజేపీ కార్యక్రమాలు
ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై
పెరిగిన రాజకీయ వేడి
ప్రభుత్వం విఫలమైందని
నిరసనలతో రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు
ఫీజు రీయింబర్స్‌మెంట్,
22ఏ భూములపై బీజేపీ
ప్రజాపాలన విజయోత్సవాల్లో
కాంగ్రెస్ జోరు
క్షేత్రస్థాయిలోకి మూడు పార్టీల నేతలు


