నిజామాబాద్ లీగ ల్ : జిల్లా కోర్టు పరిధిలో చాలాకాలంగా వివాదాల్లో ఉన్న పలు కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించడంలో మీడియేషన్ (మధ్యవర్తిత్వం) కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా న్యా య సేవా సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలోని త న చాంబర్‌లో మంగళవారం జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి నీలిమ ముద్దసానితో కలిసి మీడియేషన్‌కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కక్షిదారులకు సమయం, ఖ ర్చు ఆదా కావడంతోపాటు పరస్పర సత్సంబంధాలు కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మీ డియేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, వివాదాల పరిష్కారంలో మీడియేషన్ పాత్ర అమోఘమన్నారు. జిల్లా న్యా య సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌ను
నిర్మించే శిల్పులు గురువులు
తెయూ(డిచ్‌పల్లి): గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్‌ను నిర్మించే శిల్పులని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో వర్సిటీ లా కళాశాల సెమినార్ హాల్‌లో మంగళవారం ‘గురు వందనం– 2026’ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు గురువులను గౌరవించడంతోపాటు వారి సూచనలను పాటించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హిత వు పలికారు. గురువందనం వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో కృతజ్ఞతా భావాన్ని పెంపొందిస్తాయని రిజిస్ట్రార్ ఎం యాదగిరి అన్నారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో వీసీతోపాటు రిజిస్ట్రార్‌ను సన్మానించారు. అధ్యాపకులు ప్రసన్నరాణి, జెట్లింగ్ యెల్లోస, స్రవంతి, ప్రొఫెసర్లు సీహెచ్ ఆరతి, రాంబాబు, స్వప్న, రమణాచారి, విద్యార్థ్ధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రమోద్‌కుమార్‌కు
ఘన నివాళి
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గతేడాది నేరస్థుడు చేతిలో హత్యకు గురయ్యాడు. మంగళవారం ప్రమోద్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఎల్లమ్మ గుట్టలోని ఆయన నివాసంలో నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పాల్గొని ప్రమోద్‌కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీపీ మాట్లాడుతూ.. ప్రమోద్‌కుమార్ పోలీస్ శాఖకు అందించిన సేవలను గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ ఎంతో గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


