సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలోని పలు ప్లాస్టిక్ కవర్ల దుకాణాలు, సింగిల్ యూజ్ కవర్లు వినియోగిస్తున్న జ్యూస్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, కిరాణా దుకాణాలపై కార్పొరేషన్ ఏఎంసీ నజీరుద్దీన్ ఆ ధ్వర్యంలో మంగళవారం దాడులు చేశారు. నగరంలోని పెద్దబజార్, శివాజీనగర్, కిసా న్ గంజ్, ఖలీల్‌వాడి, గాజుల్‌పేట్, తదితర ప్రాంతాల్లో దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సింగిల్ యూజ్ క వర్లు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానాలు విధించారు. మొత్తం రూ.15వేల వర కు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. శానిటరీ సూపర్‌వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహిపాల్, కృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


