న్యూస్‌రీల్
నిజామాబాద్
వేడుకలకు గణనాథులు..
నవరాత్రి వేడుకలకు గణేశ్ ప్రతిమలు ముస్తాబయ్యాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి జిల్లాకు ప్రతిమలు తీసుకొస్తున్నారు.
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం రైస్‌మిల్లులకు కేటాయించే కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం వ్యవహారం ‘పంచాయితీ’కి దారి తీసింది. పలు మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ ఏళ్లు గడిచినా రాక బకాయిలు పేరుకుపోవడంతో ప్రభుత్వం రికవరీకి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు. పలు రైస్‌మిల్లుల్లో అసలు ధాన్యమే లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేశారు. గడువులోగా పెండింగ్ బకాయిలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించకుంటే మిల్లర్లపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదుచేసి జైలుకు పంపుతామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ప్రభుత్వం ఏకపక్షంగా దాడులను నిలిపివేయాలని తమ డిమాండ్‌లను పరిష్కరించాలంటూ మిల్లర్లు నిరసనకు దిగుతున్నారు. బుధవారం నుంచి జిల్లాలోని మిల్లులను మూసివేస్తామని, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేవరకు నిరసన తెలుపుతామని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
కొంత మంది రైస్‌మిల్లర్ల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని రైస్‌మిలర్స్ అసోసిషియేషన్ ప్రతి నిధులు వాపోతున్నారు. ప్రభుత్వం తమతో చర్చిస్తే గడువులోగా ధాన్యం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన మిల్లింగ్ చార్జీలను చెల్లించడంతోపాటు మిల్లర్లకు జరుగుతున్న నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ దాడులను తక్షణమే నిలిపివేయాలని.. ప్రభుత్వం స్పందించేవరకు మిల్లులను మూసివేయనున్నట్టు ప్రకటించారు.
జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లో
ధాన్యం మాయం
విజిలెన్స్ దాడులు, కేసులతో
ప్రభుత్వం, అధికారుల ఒత్తిడి
బ్లాక్‌లిస్టింగ్, కేసులకు బెదరని మిల్లర్లు
ప్రభుత్వం వర్సెస్ మిల్లర్లుగా పరిస్థితి
నేటి నుంచి రైస్‌మిల్లుల బంద్‌కు పిలుపు


