● ఉదయం 10.20 గంటలకు హెలికాప్టర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు..
● 10.30 గంటలకు సుభాష్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.
● 11 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో పాల్గొంటారు
● 12.15 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు
● మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్కెట్ లింకేజీ ప్రోగ్రాంలో భాగంగా పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
● 1.50 గంటలకు బర్దీపూర్ శివారులోని పీహెచ్‌ఆర్ కన్వెన్షన్‌లో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొ ని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు.
● 3.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరా బాద్‌కు తిరుగుపయనమవుతారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం (నేడు) పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపుబోర్డు కార్యాలయంలో ‘సునహరీ మిట్టి అభియాన్ – పసుపు మార్కెట్ లింకేజీ’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో చేపట్టనున్న అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
పసుపు మార్కెట్ లింకేజీకి శ్రీకారం
పసుపు పంటకు మార్కెట్ లింకేజీని కల్పిస్తూ, మార్కెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ‘సునహరీ మిట్టి అభియాన్’ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారు. పసుపు ధరకు మెరుగైన మద్ధతు ధర అందించడం, ధరలను స్థిరీకరించడం, మెరుగైన మార్కెట్ సౌకర్యాలను కల్పించేందుకు పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జిల్లాకు చెందిన ఆర్గానిక్ పసుపు రైతు లు అశోక్, లక్ష్మీనర్సయ్య, శ్రీదేవి, పాపారావు తదితరులు గవర్నర్ సమావేశంలో పాల్గొననున్నారు. ఆర్గానిక్ పంటను ప్రోత్సహిస్తూ పసుపు పంటకు మెరుగైన మార్కెట్ లింకేజీ సౌకర్యాలను కల్పించడంపై పసుపు రైతులతో చర్చించనున్నారు.
అర్వింద్ ఫౌండేషన్ కార్యక్రమానికి..
ఎంపీ అర్వింద్ పుట్టినరోజు సందర్భంగా బర్దీపూర్ లో ఉన్న పీహెచ్‌ఆర్ కన్వెన్షన్‌లో ‘అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్’(ఏడీఎఫ్) నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. చిన్నారుల వైద్య సహాయం, బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సహాయం కోసం ఏడీఎఫ్ ఫౌండేషన్ ద్వారా చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
భారీ బందోబస్తు
నిజామాబాద్ అర్బన్: గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన నేపథ్యంలో పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. సుమారు 500 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఆరుగురు ఏసీపీలు, 26 మంది సీఐలు, 52 మంది ఎస్సైలతోపాటు పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు.
జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని
సందర్మించి..
‘సునహరీ మిట్టి అభియాన్’
కార్యక్రమాన్ని ప్రారంభించనున్న శివప్రతాప్ శుక్లా
జిల్లాకు చెందిన ఆర్గానిక్ రైతులతో ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు
పసుపు మార్కెట్ లింకేజీ
సౌకర్యాల కల్పనపై చర్చ..
‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో
పాల్గొననున్న శుక్లా
పర్యటన షెడ్యూల్


