రైతుల భూములను రక్షించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల భూములను రక్షించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

రెంజల్‌: రైతులు భూములను రక్షించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. రెంజల్‌ తహసీల్‌ కార్యాలయంలో అధికారులు, నాయకులతో సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వం రైతులకు అండగా ఉంటుందని, రెవెన్యూ అధికారులు, సబ్‌ రిజిస్ట్రార్‌లు సమన్వయంతో రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతు లు ఆందోళన చెందొద్దని, కొందరు అధికారులు, అవినీతి పరుల కారణంగా ప్రభుత్వం 22 ఏ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. వివాదాస్పద భూముల సమస్యలకు సత్వరం పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. నిషేధిత జాబితాలో ఉ న్న భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి పరిష్కారం అందిస్తున్నట్లు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

కారోబార్‌ వ్యవస్థను తొలగించాలి

గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో కారోబా ర్‌ వ్యవస్థను తొలగించాలని అధికారులను ఆ దేశించారు. గ్రామాల్లో గతంలో పనిచేసిన వీఆర్‌ఏలతో భూసమస్యలు వచ్చాయని గుర్తుచేశా రు. అదే కోవలో కారోబార్‌ వ్యవస్థ ఉందన్నా రు. నీలా గ్రామ పంచాయతీలో నిధులు దు ర్వినియోగంలో కారోబార్‌ పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని, వెంటనే విచారణ చేపట్టి అతడిపై పోలీసు కేసు నమోదు చేయించాలని ఎంపీడీవోను ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి కూలీలతో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేయించాలని అధికారులకు సూచించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, డీసీసీ అధ్యక్షు డు నగేశ్‌రెడ్డి, అంతరెడ్డి రాజారెడ్డి, మాజీ జెడ్పీ టీసీ నాగభూషణంరెడ్డి, సర్పంచ్‌లు ధనుంజయ్‌, జుబేర్‌, తెలంగాణ శంకర్‌తోపాటు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు

గ్రామాల్లో అవినీతిని అరికట్టాల్సింది

అధికారులే

ఇప్పటికే వీఆర్‌ఏలతో భూసమస్యలు

ప్రభుత్వ ప్రధాన సలహాదారు

సుదర్శన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement