అధ్యాపకుల పదోన్నతులకు పచ్చజెండా | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకుల పదోన్నతులకు పచ్చజెండా

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

హైదరాబాద్‌లో తెయూ పాలకమండలి సమావేశం

12 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియమితులైన అధ్యాపకుల పదోన్నతులకు సుదీర్ఘకాలం తర్వాత ఎట్టకేలకు పాలకమండలి (ఈసీ) ఆమోదం లభించింది. వీసీ టీ యాదగిరిరావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో వర్సిటీ పాలకమండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈసీ కన్వీనర్‌, రిజి స్ట్రార్‌ ఎం యాదగిరి, పాలకమండలి సభ్యులు తెలిపిన సమావేశం వివరాలు.. ఎజెండాలోని 12 అంశాలపై చర్చించిన సభ్యులు వాటికి ఆమోదం తెలిపారు. ముఖ్యంగా 2014 అధ్యాపకుల పదోన్నతులపై సుదీర్ఘంగా చర్చ సాగింది. పదోన్నతుల విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ద్వారా న్యాయ సలహా కోరగా ఆయన పంపించిన సీల్డ్‌ కవర్‌ను పాలకమండలి సభ్యుల సమక్షంలో తెరిచారు. అధ్యాపకులకు షరతులతో కూడిన పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని ఏజీ సూచించారు. దీంతో ఈసీ ఎక్స్‌అఫీ షియో సభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, కళాశాల విద్యా కమిషనర్‌ దేవసేన, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తాపట్నాయక్‌తోపాటు సభ్యులందరూ ఏజీ సూచన మేరకు అధ్యాపకులకు కండిషనల్‌ ప్రమోషన్స్‌ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

బీఫార్మసీ కోర్సు..

తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా బీఫార్మసీ కోర్సు ప్ర వేశపెట్టడానికి వర్సిటీ పాలకమండలి ఏకగ్రీవంగా ఆమో దం తెలిపింది. వర్సిటీలో కోర్సు నిర్వహణకు అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు ఉన్నందున కోర్సు ప్రారంభించాలని, ఇందుకోసం పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని ఈసీ తీర్మానించింది. ప్ర భుత్వ అనుమతి లభిస్తే ఈ విద్యాసంవత్సరం 2026–27 నుంచే కోర్సు ప్రారంభించాలని తీర్మానం చేశారు. వర్సిటీ బడ్జెట్‌ ఆమోదం, ఇతర అభివృద్ధి, పాలనాపరమైన అంశా లపై చర్చించి ఆమోదించారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులతోపాటు సభ్యులు సీహెచ్‌ ఆంజనేయులు, సుధాకర్‌గౌడ్‌, రజినీకాంత్‌, దండు స్వామి, మదన్‌ మోహన్‌, జయంత్‌రెడ్డి, సంజీవరావు, ఘాజా, లావణ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement