వర్ని: మోస్రా మండలం గోవూర్ శివారు లోని పంట పొలాల్లో చిరుత పాదముద్ర లను అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. ఆదివారం ఈ ప్రాంతంలో చి రుత సంచరించినట్లు పాదముద్రలను ఆధారంగా అధికారులు గుర్తించారు. మోస్రా, చింతకుంట, తిమ్మాపూర్, చే నంబర్ తండా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. రైతులు పంట పొలాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని, చప్పుడు చేస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజావాణికి 103 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారు లు తమ సమస్యలను వివరిస్తూ అదనపు కలెక్టర్ భుజంగరావుతోపాటు ట్రెయినీ కలెక్టర్ సురేశ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్‌రావుకు అర్జీలు అందజేశారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణికి 32..
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యా దులు అందాయి. సీపీ సాయిచైతన్య బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీసులకు తెలుపాలని ఆయన సూచించారు.
భీమ్‌గల్‌లో
ప్లాస్టిక్ నిషేధం
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు, కవర్లను నిషేధించినట్లు కమిషనర్ గజానంద్ తెలిపారు. ఈమేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫు డ్ సెంటర్‌లు, కిరాణా దుకాణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు, చికెన్ సెంటర్లు, మటన్, ఫిష్ మార్కెట్‌లు, ఇతర అన్ని వ్యా పార, వాణిజ్య సముదాయాల యజమాను లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులను వినియోగించవద్దని సూచించారు. తమ ఆదేశాలను కాదని సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించినట్లయితే తనిఖీ నిర్వహించి జరిమానాలు విధించడంతో పాటు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కళ్యాపూర్ గ్రామంలో..
రెంజల్: మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లను నిషేధిస్తూ జీపీ పాలకవర్గం తీర్మానించారు. గ్రా మంలోని జీపీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ భానుచందర్ అధ్యక్షతన సమావే శం నిర్వహించి, సభ్యులు తీర్మానం చేశారు. ఎవరైనా నిబంధన ఉల్లంఘిస్తే జరిమానా వసూలు చేస్తామన్నారు. ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, వ్యాపారులు పాల్గొన్నారు.


