● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య
● కేసుల దర్యాప్తుపై అటవీ అధికారులకు ఒక రోజు శిక్షణ
నిజామాబాద్‌అర్బన్: కేసు నమోదు, ఎఫ్‌ఐఆర్ దశ నుంచి దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు చేసే వరకు ప్రతి దశలోనూ సత్వర చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. కమిషనరేట్ కార్యాలయంలో నేర పరిశోధన, కేసుల ద ర్యాప్తుపై అటవీశాఖ సిబ్బందికి సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, నిందితులపై నేరం రుజువయ్యే వరకు పక్కా ఆధారాలను సేకరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బీఎన్‌ఎస్‌ఎస్‌లో దర్యాప్తునకు సంబంధించిన సెక్షన్‌లు 176 నుంచి 193 వరకు అలాగే స మన్‌లు, వారెంట్ల అమలుకు సంబంధించి నిబంధనలను పొందుపరిచారని తెలిపారు. సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాల ప్రాధాన్యతను వివరించారు. కే సు నమోదు చేయడం మాత్రమే కాకుండా కోర్టులో నేరాన్ని నిరూపించి నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడేవిధంగా పక్కా దర్యాప్తు చేపట్టాలన్నారు. అటవీ నేరాలకు సంబంధించిన కేసుల్లో పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ల మధ్య సమన్వయం, శాసీ్త్రయ ద ర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, న్యాయపరమైన ప్రక్రియపై అవగాహన కల్పించారు. సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఇన్‌స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్‌భట్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీ సాయిచైతన్య.. హాజరైన ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది


