వలస కార్మికుల కోసం పటిష్టమైన విధానం | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల కోసం పటిష్టమైన విధానం

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

నిజామాబాద్‌ రూరల్‌: వలస కార్మికుల సంక్షేమం కోసం మరింత పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి అన్నారు. తమ దేశ పౌరుల కోసం ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వలస సంక్షేమ విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలోనూ అనుసరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. క్యాప్‌ కార్యాలయంలో సో మవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నా రై పాలసీ తీసుకురావడంతోపాటు గల్ఫ్‌ వెల్ఫేర్‌ బో ర్డు ఏర్పాటు చేయాలని ఎన్నికలకు ముందే పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో నిర్ణయించామని గుర్తు చేశా రు. తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నారై అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసిందని, నిపుణులతో ఏర్పాటైన కమిటీలో తాను సైతం సభ్యుడిగా ఉన్నానని అన్నారు. ఫిలిప్పీన్స్‌కు గల్ఫ్‌ దేశాలతో సంబంధం ఏమిటని కొందరు ప్రశ్నించినప్పటికీ.. ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళ్తున్నందున, అక్కడి వారి సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించడమే తమ కమిటీ పర్యటన ఉద్దేశమని స్పష్టం చేశారు. 1990 నుంచే అక్కడ వలస కార్మికుల కోసం సమగ్ర చట్టాలు, విధానాలు అమల్లో ఉన్నాయన్నారు. తమ పర్యటనకు సంబంధించిన సమగ్ర నివేదికను మరికొన్ని రోజు ల్లో సీఎం రేంత్‌రెడ్డికి అందజేస్తామన్నారు.

కేంద్రం నిధులు ఇవ్వడం లేదు

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని భూపతిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఆదాయం వెళ్తున్నప్పటికీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ యువత కోసం ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు తీసు కురావడం, అంతర్జాతీయ అవకాశాలను పెంచడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని, ఆయన ప్రయత్నాలను రాజకీయ కారణాలతో కేంద్రంలోని బీజేపీ అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు.

సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, పొలసాని శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు బాగారెడ్డి, అంబర్‌సింగ్‌, చింతల కిషన్‌, మోహన్‌, హన్మాండ్లు, జలంధర్‌రెడ్డి, రాంచందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఐల సంక్షేమానికి

ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఫిలిప్పీన్స్‌ మోడల్‌ను

తెలంగాణలోనూ అమలు చేస్తాం

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే

డాక్టర్‌ భూపతిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement