న్యూస్‌రీల్
విచారణలతోనే సరి..
బోధన్ బల్దియాలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు అందగా, అధికారులు విచారణ చేపట్టి వెళ్లిపోయారు.
సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు రెండుమూడు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. దీంతో రోడ్డెక్కాలంటేనే మహిళలు భయపడుతున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ఐదు చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోగా.. దుండగులు రెండు చోట్ల విఫలమయ్యారు. మూడు చోట్ల మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు.
నిజామాబాద్‌అర్బన్: గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో చోటుచేసుకుంటున్న ఘటనలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నిజామాబాద్‌నగరంతోపాటు పల్లెల్లోనూ చైన్‌స్నాచర్లు హల్‌చల్ చేస్తున్నారు. 2022 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 139 గొలుసు దొంగతనాలు జరగగా.. 54 కేసులను మాత్రమే పోలీసులు ఛేదించారు. మరో వైపు ఈ కేసుల్లో రికవరీ కూడా తక్కువగా ఉండటం గమనార్హం.
● ఈనెల 13వ తేదీన నందిపేట మండలం ఉమ్మెడ వద్ద మహిళ మెడలో నుంచి దుండగులు చైన్ లాక్కెళ్లగా మరుసటి రోజు పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఇదే రోజు మాక్లూర్ మండలం గోట్టుముక్కలలో చైన్ స్నాచింగ్ జరిగింది.
● 14 తేదీన నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ వద్ద మహిళ మెడలో నుంచి దుండగులు గొలుసు లాక్కునేందుకు యత్నించగా.. మహిళ అప్రమత్తం కావడంతో పారిపోయారు. సుమారు గంట తర్వాత నగరంలోని తిరుమల టాకీస్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తున్న మానస అనే మహిళ మెడలోనుంచి బైక్‌పై వచ్చిన దుండగులు చైన్ లాక్కెళ్లారు.
● 15వ తేదీన ఆర్మూర్‌లోని పెర్కిట్ వద్ద దంపతులను చైన్ స్నాచర్లు వెంబడించారు. గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించి విఫలమయ్యారు.
గతంలో..
జూలై 11వ తేదీన నగరంలోని దుబ్బ ప్రాంతంలో మహిళపై దాడి చేసి చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు ముందు అదే రోజు ముబారక్‌నగర్ ప్రాంతంలోని శ్రీనివాసనగర్ కాలనీలో మరో మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు. మే 27 తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీకి చెందిన ముఠా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడింది, నగరంలోని గాయత్రినగర్‌లో, సుభాష్‌నగర్‌లో మహిళల మెడల్లో నుంచి చైన్‌లు లాక్కెళ్లారు. అంతేగాక వీరే ఆలూర్ మండలం రామచంద్రపల్లి బస్‌స్టాప్ వద్ద సాయంత్రం సమయంలో గూపన్‌పల్లికి చెందిన లక్ష్మి మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. అలాగే నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రుద్రూర్, బోధన్ ప్రాంతాల్లోనూ చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.
● 2025 డిసెంబర్ 26న ఉదయం వేళ నిజామాబాద్ నగరంలోని వినయక్‌నగర్, కోటగల్లీ ప్రాంతాల్లో ఇదరు మహిళల చైన్‌లను లాక్కెళ్లారు.
అటు సమీక్షలు.. ఇటు ఘటనలు
సీపీ సాయిచైతన్య కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేయడంతోపాటు డివిజన్‌స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ కార్యాలయంలోనూ సమీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్‌లో గత నెలలో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించిన మరుసటిరోజే మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా మెడికల్ షాపులో చోరీకి పాల్పడింది. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్న దుండగులు రెండుచోట్ల మహిళల మెడల్లో నుంచి చైన్‌లను లాక్కెళ్లారు. ఇటీవల నందిపేటలో సీపీ సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈనెల 14న సీపీ సాయిచైతన్య నగరంలోని బోర్గాం(పి) బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అదే రోజు గంట తర్వాత తిరుమల టాకీస్ చౌరస్తాలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ వైపు సీపీ సమీక్షలు, తనిఖీలు కొనసాగుతుండగా.. మరోవైపు నేరాలు చోటుచేసుకుంటున్నాయి.
జిల్లాలో గొలుసు దొంగతనాలు
నిఘా సారించాం
చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే దుండగులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది. పాత నేరస్తులు, ఇ తర రాష్ట్రాలకు చెందిన వారిపై నిఘా సారించాం. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన జరుగుతుంది. ప్రజలు కూడా నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
– ప్రకాశ్‌యాదవ్, ఏసీపీ, నిజామాబాద్ డివిజన్


