నిజాంసాగర్ /బిచ్కుంద: కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురు జొనిట వివాహ విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జొనిట వివాహం దాస్‌తో జరుగనుండగా.. ఆదివారం బిచ్కుందలో విందు ఏర్పాటు చేశారు. సీఎంతోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్, సంజీవ్‌రెడ్డి విందుకు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆశీర్వదించారు.


