బురుజుతో ముప్పు.. కలగదా కనువిప్పు? | - | Sakshi
Sakshi News home page

బురుజుతో ముప్పు.. కలగదా కనువిప్పు?

Aug 17 2026 12:53 AM | Updated on Aug 17 2026 12:53 AM

హున్సాలో ప్రమాదకరంగా

మట్టి బురుజులు

తరచూ పడుతున్న మట్టి పెల్లలు

బోధన్‌: రక్షణ కోసం వందల ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక బురుజులు ఎప్పుడు కూలుతా యో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. మంజీర నది తీరంలో ఉన్న సాలూర మండలంలోని హున్సా గ్రామం చుట్టూ ఏడు ఎత్తైన బురుజులు ఉండేవి. ఐదు కాలగర్భంలో కలిసిపోగా.. ప్రస్తుతం రెండు మిగిలాయి. ఈ రెండు మట్టిబురుజులు చుట్టూ పాత కాలం నాటి పెంకుటిళ్లతో పాటు ఆధునాత భవనాలు నిర్మించు కుని ప్రజలు నివాసం ఉంటున్నారు. మట్టిబురుజులు అనుహ్యంగా కుప్ప కూలితే ప్రజల ప్రా ణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. కళ్లెదుటే ప్రమాదం నిలిచి ఉన్నా అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలంలో బురుజుల నుంచి మట్టి పెల్లలు విరిగి పడుతున్నాయని, అవి ఎప్పుడు కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న బురుజులను గతంలో ఆర్డీవోగా పని చేసిన శ్యాంప్రసాద్‌లాల్‌ పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించి బురుజులను వెంటనే తొలగించేందుకు అంచనా వ్యయం తయారు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత సమస్య అలాగే మిగిలిపోయింది. సర్పంచ్‌ శివకుమార్‌ పటేల్‌ సాలూరా తహసీల్దార్‌ను కలిసి సమస్య తీవ్రత, గతంలో అధికారుల పరిశీలనకు సంబంధించిన వివరాలను తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి అడుగు ముందుకు పడడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement