రూ.27 కోట్ల విలువైన ధాన్యం గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.27 కోట్ల విలువైన ధాన్యం గోల్‌మాల్‌

Aug 17 2026 12:53 AM | Updated on Aug 17 2026 12:53 AM

స్కేటింగ్‌లో యువకుల ప్రతిభ

రైస్‌మిల్‌ యాజమాన్యంపై కేసు

డిచ్‌పల్లి: మండలంలోని సుద్దులం గ్రామ శివారులో ఉన్న ఓం సాయిబాలాజీ రైస్‌మిల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహ్మద్‌ ఆరిఫ్‌ ఆదివారం తెలిపారు. రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయించగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ప్రభుత్వానికి అప్పగించక పోవడంతో సివిల్‌ సప్లై ఆధ్వర్యంలో మూడు రోజులపాటు మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 8 వేల క్వింటాళ్లు ధాన్యం గోల్‌మాల్‌ అ య్యిందని, దాని విలువ రూ.27,11,17,286 ఉంటుందని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు లెక్క తేల్చారు. సివి ల్‌ సప్లయీస్‌ డీఎం ఫిర్యాదు మేరకు రైస్‌మి ల్లు యజమానులైన కూన వెంకటేశం, కూన వరలక్ష్మి, కూన ప్రియాంకపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నాగభైరవ పురస్కారం అందుకున్న చింతల

నిజామాబాద్‌ రూరల్‌: ఇందూరు కవి, బాలసాహితీవేత్త చింతల శ్రీనివాస్‌గుప్తా నాగభైరవ జాతీయ స్థాయి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఒంగోలులోని రాఘవ భైరవ సాహిత్య పీఠం బాల సాహిత్య పుస్తకాలకు ఇచ్చే పురస్కారానికి జిల్లాకు చెందిన కవి చింతల శ్రీనివాస్‌గుప్తా రచించిన బాల సాహిత్య గ్రంథం ‘చిగురింతలు’ ఎంపికై ంది. ఆదివారం ఒంగోలు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్‌గుప్తా పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారం అందుకున్న చింతల శ్రీనివాస్‌గుప్తాను ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ శర్మ, కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ శారద తదితరులు అభినందించారు.

రెజ్లింగ్‌ అకాడమీకి

ఎంపిక

మోపాల్‌: విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి తాము పుట్టిన గ్రామంతోపాటు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కు, విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మంచిప్ప జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యా యుడు గేమ్‌సింగ్‌ అన్నారు. తమ పాఠశాల నుంచి తెలంగాణ రీజినల్‌ స్పోర్ట్స్‌ రెజ్లింగ్‌ అకాడమీకి ఎంపికై న బీ శ్రీకాంత్‌, బీ ప్రవీణ్‌, బీ మహేందర్‌ను హెచ్‌ఎంతోపాటు పీఈటీ దేవేందర్‌, గ్రామస్తులు ఆదివారం అభినందించారు. పీఈటీ మాట్లాడుతూ.. అకాడమీ లో తెలంగాణ నుంచి 12 సీట్లకుగాను ము గ్గురు మంచిప్ప జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని హన్మాజీపేట్‌ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్కేటింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని శ్రీరాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కేటింగ్‌లో ఆదివారం నిర్వహించిన పోటీ ల్లో గ్రామానికి చెందిన కమ్మరి ఆనంద్‌, పర్షా వినయ్‌, వడ్ల శ్రావణ్‌ పాల్గొన్నారు. 80 నిమిషాల నాన్‌స్టాప్‌ రోలర్‌ స్కేటింగ్‌లో పాల్గొని బహుమతులు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement