నిజామాబాద్‌అర్బన్: సీపీ సాయి చైతన్యకు జాతీయస్ధాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ సేవలు అందిస్తున్న అధి కారులను, నాయకుల ను జాతీయస్థాయిలో ఫేమ్ ఇండియా – ఏషియా పోస్ట్ సంస్థలు ఎంపిక చేయగా.. సీపీ సాయిచైతన్యకు చోటు లభించింది. దేశ వ్యా ప్తంగా మొత్తం 100 మందిని ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి ముగ్గురు ఐపీఎస్‌లు ఉన్నారు. ప్రజాభద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానలు తదితర అంశాల ఆధారంగా ఐపీఎస్‌లను ఎంపిక చేశారు. జిల్లా పోలీసుయంత్రాంగం సీపీకి అభినందనలు తెలిపింది.
పోక్సో కేసుల్లో
నిందితులను పట్టుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: పోక్సో కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను వీలైంత త్వరగా పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తిసుకోవాలని సీపీ సాయిచైతన్య అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం పోక్సో కేసుల పురోగతిపై సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధి త చిన్నారులకు న్యాయం అందేలా చూడాలన్నారు. బాధిత చిన్నారుల వివరాలు గోప్యంగా ఉంచాలని, కేసుల దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటి వరకు నమోదైన పోక్సో కేసులు.. వాటి స్థితిగతులపై సీపీ క్షుణ్ణంగా సమీక్షించారు. సమావేశంలో ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.


