న్యూస్‌రీల్
అదనంగా 28 పోలింగ్..
జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. అయితే ఇప్పుడు చేతికందనున్నవి డిజిటల్ కార్డులు. ఏటీఎం కార్డుల తరహాలో రేషన్ కార్డులను రూపొందించిన ప్రభుత్వం.. కుటుంబ యజమాని, సభ్యుల పేర్లతోపాటు సీఎం, సంబంధిత మంత్రి ఫొటోతో కార్డులను తీసుకువస్తోంది. ఇప్పటికే కార్డులు జిల్లాకు చేరగా.. పంపిణీపై మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.
క్యూఆర్ కోడ్‌తో భద్రం
కాగితానికి స్వస్తి చెప్పి ఏటీఎం కార్డు తరహాలో రేషన్‌కార్డును రూపొందించింది. చినిగిపోకుండా, తడిసిపోకుండా ఉండే విధంగా భద్రతా ప్రమాణాలతో రూపకల్పన చేశారు. కార్డుకు ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోతోపాటు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు, కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు ముద్రించారు. మరోవైపు క్యూఆర్ కోడ్‌ను పొందుపర్చారు. సంబంధిత రేషన్‌దుకాణాలకు వెళ్లి స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయి. త్వరలో ఇదే కార్డుపై బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ 15న పంపిణీకి ఏర్పాట్లు
ఇప్పటికే చేరిన కార్డులు
జిల్లాలో 4,77,780 కార్డుదారులు
నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్న ఎమ్మెల్యేలు?


