డొంకేశ్వర్(ఆర్మూర్): అటవీ శాఖలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సస్పెండైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు కమ్మర్‌పల్లి రేంజ్‌లోని ఇనాయత్‌నగర్ బీట్ ఆఫీసర్ శ్రీదేవిని, వర్ని రేంజ్‌లోని మేడిపల్లి బీట్ ఆఫీసర్ వినోద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) ప్రశాంత్ బాజీరావు పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే రేంజ్‌లో మరో బీట్ ఆఫీసర్‌ను కూడా వేరే విషయంలో సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
‘కల్తీ కల్లును
నియంత్రిస్తున్నాం’
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ కల్తీ కల్లును నియంత్రిస్తున్నామని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అరుణ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ డివిజన్‌లో 34, ఆర్మూర్ డివిజన్‌లో 14, బోధన్ డివిజన్‌లో 26, భీమ్‌గల్ డివిజన్‌లో మూడు, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో పది కేసులు నమోదైనట్లు వివరించారు. బోధన్ స్టేషన్ పరిధిలో 19 మంది, భీమ్‌గల్ స్టేషన్ పరిధిలో 94 మంది, ఆర్మూర్ స్టేషన్ పరిఽధిలో ఇద్దరు , నిజామాబాద్ స్టేషన్ పరిధిలో 29 మందిని అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ
తైక్వాండో లో పతకాలు
నిజామాబాద్ అర్బన్: జిల్లాకు చెందిన తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా (టీఎంఏఏఐ) విద్యార్థులు థాయిలాండ్‌లోని ఈస్టర్న్ నేషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన 9వ హీరోస్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియనన్‌షిప్‌లో అద్భు త ప్రదర్శన కనబరిచారు. పోటీల్లో 33 దేశా ల తరఫున క్రీడాకారులు పాల్గొనగా నగరానికి చెందిన షేక్ మైతాబ్ అహ్మద్ (–81 కిలోలు) రెండు విభాగాల్లో ఒక బంగారు, ఒక కాంస్య పతకం గెలుచుకున్నాడు. షేక్ తల్హా (–41 కిలోలు) శక్తివంతమైన ప్రదర్శనతో ఒక వెండి పతకం సాధించాడు. ఇల్హాన్ అబ్దుల్లా ఫారూకీ (–31 కిలోలు) విభాగంలో కాంస్య పతకం గెలుపొందాడు. క్రీడాకారులను సీపీ సాయిచైతన్య, ఏసీపీ ప్రకాశ్‌యాదవ్ అభినందించారు.
మళ్లీ దంచికొట్టిన వాన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి పట్టణంలో 77.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. సదాశివనగర్‌లో 68.5 మి.మీ.లు, ఎల్పుగొండలో 50 మి. మీ.లు, గాంధారిలో 46.5, బీబీపేటలో 46.3, దోమకొండలో 41.3 తాడ్వాయిలో 38.5, లచ్చాపేటలో 36.8, హసన్‌పల్లిలో 35.5, ఇసాయిపేటలో 34.8, పిట్లంలో 33.8, బొమ్మన్‌దేవ్‌పల్లిలో 32.8, సర్వాపూర్ లో 30.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.


