పెరిగిన ఆరుతడి పంటల సాగు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన ఆరుతడి పంటల సాగు

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చన్న అధికారుల సూచన మేరకు కొంతమంది రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేశారు. వ్యవసాయ శాఖ వేసిన అంచనా కన్నా ఎక్కువ ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతుండడం గమనార్హం. మినుములు 19 ఎకరాల్లో సాగవుతాయని అంచనా ఉండగా 138 ఎకరాల్లో వేశారు. అలాగే పెసర 29 ఎకరాలకుగాను 160 ఎకరాల్లో, కందులు 832 ఎకరాలకు గాను 960 ఎక రాల్లో రైతులు సాగు చేస్తున్నారు.

సోయా కూడా అంచనాకు మించి 35,166 ఎకరాల్లో వేశారు. యూ రియాను పరిమితం చేయడం, నీటి లభ్యత తక్కువగా ఉండడంతో కొందరు రైతులు వరి స్థానంలో పప్పుదినుసుల పంటలు సాగు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement