గోరింటాకు | - | Sakshi
Sakshi News home page

గోరింటాకు

Jul 19 2026 1:08 AM | Updated on Jul 19 2026 1:08 AM

ఆషాఢ మాసంలో ముత్తైదువులు, యువతులు గోరింటాకును చేతులకు, పాదాలకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య, శాసీ్త్రయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. గోరింటాకును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని, భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడని నమ్ముతారు. చేతిలో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే, అంత మంచిదని మహిళలు సంతోషిస్తారు. అలాగే వర్షాలు మొదలైన సమయంలో వాతావరణంలో తేమ పెరిగి, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా మహిళలు నీటిలో ఎక్కువగా పనిచేయడం వల్ల చేతులు, కాళ్ల గోర్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. గోరింటాకుకు యాంటీ సెప్టిక్‌ ఒంటికి చలవ చేసే గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement