అభ్యాసానికి చేయూత | - | Sakshi
Sakshi News home page

అభ్యాసానికి చేయూత

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

రెమిడియేషన్‌ ప్రోగ్రాం అంటే..

ఉపాధ్యాయులను కేటాయించాలి

ఏఐ బోధనను అమలు చేయాలి

ప్రాథమిక విద్యలో రెమిడియేషన్‌ ప్రోగ్రాం

అభ్యాసన లోపాల నివారణకు

ప్రత్యేక కార్యాచరణ

నేటి నుంచి 25 వరకు ఎస్జీటీలకు శిక్షణ

కమ్మర్‌పల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు వి ద్యాశాఖ రెమిడియేషన్‌ ప్రోగ్రాం కార్యకమాన్ని చేపట్టింది. చదవడం, రాయడం ప్రాథమిక గణిత నైపు ణ్యాల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రతిరోజు కేటాయించిన ప్రత్యేక సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు (ఎస్‌జీటీలు) నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దశలవారీగా శిక్షణ నిర్వహించనున్నారు. మండలాల వారీగా ఏ ర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల్లో బోధనా విధానాలు, అభ్యాసన లోపాల గుర్తింపు, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధించే పద్ధతులు, నిరంతర మూ ల్యాంకనంపై నిపుణులు అవగాహన కల్పిస్తారు.

శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస స్థాయిని పరీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడీయల్‌ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు తరగతి స్థాయికి తగిన కనీస అభ్యాస నైపుణ్యాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపడతారు. గత వారం మాక్లూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో శిక్షణ పొందిన మండల రిసోర్స్‌పర్సన్లు సోమవారం నుంచి ఆయా మండలాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, గణితం విషయాలలో రెమిడియేషన్‌ కార్యక్రమం ప్రతి సబ్జెక్ట్‌కు రెండు రోజుల చొప్పున తరగతి గదిలో ఉపాధ్యాయులు నిర్వహించనున్నారు.

అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించడం

చదవడం, రాయడం, గణితంలో ప్రత్యేక బోధన అందించడం.

ప్రతి విద్యార్థి స్థాయికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక రూపొందించడం.

నిరంతర మూల్యాంకనం ద్వారా పురోగతిని అంచనా వేయడం.

కనీస అభ్యాసన సామర్థ్యాలు సాధించే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం.

తొలిమెట్టులో భాగంగా వెనుక బడిన పిల్లల అభ్యాసన మద్ద తుకు రెమిడియేషన్‌ శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాకుండా, విద్యార్థుల సంఖ్య 40 కంటే ఎక్కువగా ఉన్న చోట తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తే ఫలితాలు ఇంకా బాగా వస్తాయి. – అంకం నరేశ్‌,

ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, రేకులపల్లి, ధర్పల్లి

ఎఫ్‌ఎల్‌ఎన్‌ కోసం విద్యాశాఖ ప్రతి కాంప్లెక్స్‌కు మూడు ఆదర్శ పాఠశాలలకు తగిన కంప్యూటర్లను ఇచ్చి ఏఐ(కృత్రిమ మేధస్సు) బోధనను అమలు చేయాలి. ప్రతి మండల విద్యాశాఖ అధికారి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు నిరంతర తనిఖీలు చేపట్టి అవసరమైన సహకారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అందించాలి.

– బోయెడ నర్సయ్య, డీఆర్పీ, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement