నిజామాబాద్ రూరల్: ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమల క్షేత్రంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది వనభోజనాలను ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ధన్‌పాల్ శ్రీనివాస్ గుప్తా, ఇల్లెందుల ప్రభాకర్, కోశాధికారి గాలి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, ఆలయ ధర్మకర్త సంపత్ తదితరులు పాల్గొన్నారు.


