శ్రీరాంసాగర్ సాగర్ (ఎస్సారెస్పీ) బ్యాక్ వాటర్ ప్రాంతం సరికొత్త ప్రకృతి శోభతో అలరారుతోంది. ప్రశాంతమైన జలాలు, చుట్టూ పరుచుకున్న పచ్చని గడ్డి మైదానాలు, సుదూర తీరాన వరుసగా ఉన్న తాటి చెట్లు.. వంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిపై సూర్య కిరణాల ప్రతిబింబం ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచుతోంది. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడ బ్యాక్ వాటర్ వద్ద ఈ మనోహర
దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో క్లిక్‌మనిపించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్)


