మరోసారి మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించిన పూర్ణ | - | Sakshi
Sakshi News home page

మరోసారి మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించిన పూర్ణ

Jul 20 2026 1:20 AM | Updated on Jul 20 2026 1:20 AM

సిరికొండ(నిజామాబాద్‌రూరల్‌): యూరప్‌లోని అ త్యున్నత శిఖరమైన మౌంట్‌ ఎల్బ్రస్‌ పర్వతాన్ని జిల్లాకు చెందిన మాలావత్‌ పూర్ణ మరోసారి అధిరోహించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని చిన్న వయస్సులో అధిరోహించిన సిరికొండ మండలం పాకాలకు చెందిన పూర్ణ.. ప్రము ఖ పర్వతారోహణ సంస్థ ట్రాన్స్‌సెంట్‌ అడ్వెంచర్స్‌ ఆధ్వర్యంలో మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించిన బృందానికి ఎక్స్‌పెడిషన్‌ లీడర్‌గా వ్యవహరించారు. పూర్ణ నాయకత్వంలో భారతీయ బృందం ఈనెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు (రష్యా కాలమానం) మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించింది. రష్యా లోని కాకసస్‌ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్‌ ఎల్బ్రస్‌ యూరప్‌లోని అత్యున్నత శిఖరం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత సెవెన్‌ సమిట్స్‌లో ఒకటి. తీవ్రమైన చలి, బలమైన గాలులు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement