సంక్షిప్తం
అంగన్‌వాడీ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి జీపీ పరిధిలోగల గాంధీనగర్ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం ప్రీ స్కూల్ పిల్లలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన యూనిఫామ్స్‌ను సర్పంచ్ కులచారి అశ్విని పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి గంగాధర్, వార్డుసభ్యులు,అంగన్‌వాడీ టీచర్ సుశీల,ఆ యా రూపాలి ఆశా కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులున్నారు.
రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు సన్మానం
సుభాష్‌నగర్: సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలు అందుకున్న ‘బగ్గలి స్వప్న రజక, సురుకుట్ల ఝాన్సీలను సోమవారం నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వాసంజయ, రేఖ, రుక్మిణి, అపర్ణ, సుధాకర్, కరిపే రవీందర్, దేవేందర్, అజయ్, చంద్రకాంత్, సురకుట్ల విజయ్, సాయి బసవ, సత్యనారాయణ, సురేందర్, బాలన్న, దేశాయి గంగాధర్, దామ నరసయ్య, హనుమాండ్లు పాల్గొన్నారు
షూటింగ్ క్రీడాకారుడికి అభినందన
సుభాష్‌నగర్: జిల్లాకు చెందిన క్రీడాకారుడు బొప్పు రణ్‌వీర్ ఇటీవల ఓపెన్ నేషనల్ మల్టీ టార్గెట్ స్పోర్ట్స్ మొదటి చాంపియన్‌షిప్–2025లో పాల్గొని 25 మీటర్ల బెంచ్ రెస్ట్ షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈసందర్భంగా సోమవారం మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తన నివాసంలో రణ్‌వీర్‌ను అభినందించారు. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్, తాను స్థాపించిన నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా రణవీర్‌కు భవిష్యత్‌లో ప్రోత్సాహం అందిస్తానని ఆయన హామీనిచ్చారు.
సమయానికంటే ముందే ఇంటికి..
సిరికొండ: మండల పంచాయతీ అధికారి తారాచంద్ సా యంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా, సోమవారం నాలుగు గంటలకే ఆర్టీసీ బస్సులో నిజామాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఎంపీవో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం కార్యాలయం సమయాని కంటే ముందే వెళ్లి పోతారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎంపీడీవో మనోహర్‌రెడ్డిని ఫోన్ లో వివరణ కోరగా తాను నిజామాబాద్‌లో ఉన్నానని, మంగళవారం తగిన విచారణ జరుపుతానన్నారు.
పెటా క్యాలెండర్ ఆవిష్కరణ
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో అశోక్ జిల్లా తెలంగాణ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం(పెటా) క్యా లెండర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ప్రసా ద్, ఉపాధ్యక్షుడు సుశీల్ కుమార్, పావని, ప్రతిభ ఉన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
సుభాష్‌నగర్: నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఇంట్రా మ్యూరల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి సోమవా రం ప్రారంభించారు. నేడు ఫైనల్ మ్యాచ్ ఆర్ట్స్ విభాగం, ఫిజికల్స్ సైన్స్ విభాగాల మధ్య జరుగుతుందని ఫిజికల్ డైరెక్టర్ బాలమణి తెలిపారు.
అక్రమ ఓట్లను తొలగించాలి
నిజామాబాద్ రూరల్: జిల్లాలోని 13వ డివిజన్ సారంగాపూర్‌లో అక్రమంగా దాదాపు1600 ఓట్లు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని 13 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ రాంసింగ్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. వాటిని తొలగించాలని త్వరలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తామన్నారు.
ఓటర్‌జాబితాలో అవకతవకలు
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్‌అహ్మద్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఆజారొద్దీన్ ఆరోపించారు. ఈవిషయమై సోమవారం కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు.
వెనిజులాపై అమెరికా ఏకపక్ష దాడి అమానుషం..
నిజామాద్ రూరల్: వెనిజులాపై అమెరికా ఏకపక్ష దుర్మార్గ దాడి అమానుషం అని హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధా న కార్యదర్శి శివకుమార్ ఒక ప్రకటనలో అన్నారు. భారతదేశం అమెరికా చర్యలను ఖండించాలన్నారు.
కొనసాగుతున్న పాశురాల ప్రవచనాలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని చక్రం గుడిలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప్పావై పాశురాల ప్రవచనాల కార్యక్రమం వెభవంగా కొనసాగుతున్నాయి. ప్రవచనాలు ఈనెల 14 వరకు కొనసాగుతాయని, అర్చకులు నరసింహ మూర్తి, నాని స్వామి తెలిపారు.


