త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం
మోపాల్: మండలంలోని కంజర్ శివారులోగల తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పా ఠశాలలో త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంగీతాన్ని భక్తిగా మార్చి, భక్తిని సంగీతంగా ఆవిష్కరించిన మహానుభావుడు సంత్ త్యాగరాజ స్వామి అని కళాశాల ప్రిన్సిపాల్ జి విజయలలిత కొనియాడారు. త్యాగరాజ ఆరాధన కేవలం ఒక సంగీత సభ మాత్రమే కాదు.. ఇది ఒక ఆధ్యాత్మిక యజ్ఞమని పేర్కొన్నారు. పాఠశాలలోని సంగీతవాద్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులందరూ సంగీతం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సంగీత ఉపాధ్యాయురాలు జి సుజాత సూచించారు. ఈ మహోత్సవానికి సంగీత వాద్య సహకారం అందించిన వయోలిన్ వేదాంత సీతారామచంద్రమూర్తి, మృదంగం విశ్వనాథ్, తబలా యోగేశ్ జోషి, పి యానో సంబేటి రాము, ప్యాడ్ సంబేటి శ్యామ్‌లను ప్రిన్సిపాల్ సన్మానించారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


