మొరాయించిన మాధవనగర్ రైల్వేగేటు
నిజామాబాద్ రూరల్: బర్ధిపూర్ శివారులోని మాధవనగర్ రైల్వేగేటు సోమవారం మొరాయించింది. దీంతో ఇరువైపులా వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వే ళ రైలు వస్తుండటంతో గేట్‌మన్ రైల్వేగేటు వే శాడు. రైలు వెళ్లిన అనంతరం ఒకవైపు గేటు లే వగా కొందరు వాహనదారులు ముందుకు వె ళ్లారు. కానీ ఇంకో గేటు లేవకపోవడంతో ప్ర యాణికులు పట్టాల మధ్యలోనే ఉండిపోయా రు. అరగంట తర్వాత మళ్లీ గేట్‌మన్ రైల్వేగేట్‌ను వేసి తీయడంతో గేటు మొత్తం రెండు వైపులా తెరుచుకోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.


