బీజేపీ, ఎంఐఎంలవి ఎన్నికల డ్రామాలు
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఎన్నికల డ్రామాలు చేస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మున్సిపల్ కమిషనర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయగా, ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు మించకుండా రావాల్సి ఉండగా, బీజేపీ, ఎంఐఎం నాయకులు తమ కార్యకర్తలతో కలిసి అధిక సంఖ్యలో వచ్చారన్నారు. నిజామాబాద్‌లో ఓటు హ క్కు లేని షబ్బీర్‌అలీ కొడు కు ఇలియాస్ నిజామాబాద్ మేయర్ అవ్వడానికి ఎలా సాధ్యమవుతుందొ బీజేపీ జిల్లా అధ్యక్షుడే తెలపాలని ఆయన అన్నారు.


