విద్యుత్ మరమ్మతులు సొంతంగా చేయొద్దు
ధర్పల్లి: విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు ప్రజ లు సొంతంగా మరమ్మతులు చేయొద్దని గ డ్కోల్ సెక్షన్ ఏఈ శివకుమార్ అన్నారు. మండలంలోని హోన్నాజీపేట్ గ్రామంలో సోమవా రం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతులకు, వినియోగదారులకు విద్యుత్ వల్ల జరిగే ప్రమాదాలను, జా గ్రత్తలను వివరించారు. రైతులు నాణ్యమైన కరెంటు కోసం ఐఎస్‌ఐ ఉన్న కెపాసిటర్లు, మో టార్లను వాడాలన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్ రావు, లైన్‌మెన్ కాశీ రాం, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: ఐరన్ అధికంగా ఉండే పాలు, పండ్లు, ఆకుకూరలు వంటి పౌష్టికాహారంతోనే ఆ రోగ్యం లభిస్తుందని డాక్టర్ అంకం భానుప్రి య తెలిపారు. నగరంలోని శంకర్ భవన్ ప్ర భుత్వ పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అమె విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. హెచ్‌ఎం సాయన్న, క్లబ్ ప్రతినిధులు అబ్బా యి లింబాద్రి, రాఘవేంద్ర బాబు, అంకం రా జేందర్, చింతల గంగాదాస్, ఉపాధ్యాయులు వెనిగల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభు త్వ కళాశాలలో సోమవారం కామర్స్ విభాగంతో ఎస్‌జీడీ ప్రొఫెసనల్ ఐటీ సెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా వర్క్‌షాప్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యం, ఉ ద్యోగావకాశాలు మెరుగుపర్చడానికి వర్క్ షా పు ఎంతగానో ఉపమోగపడుతుందన్నారు.
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. నగరంలోని కంఠేశ్వర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సోమవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు ప్లకార్డులు పట్టుకిని అవగాహన కల్పించా రు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: రిటైర్డ్ అంగన్‌వాడీల స మస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశా రు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వారికి ఇచ్చిన హామీలను అమలు జరపాలన్నారు. లే నియెడల ఆందోళనలు చేస్తామని హెచ్చరించా రు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందిచారు. సంఘ ప్రతినిధులు హైమావతి, లలిత, రమ, పుష్ప, శోభారాణి పాల్గొన్నారు.
విద్యుత్ మరమ్మతులు సొంతంగా చేయొద్దు
విద్యుత్ మరమ్మతులు సొంతంగా చేయొద్దు


