‘కార్పొరేషన్’పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం
● మేయర్ పీఠంపై ఇందూరు
బిడ్డనే కూర్చోబెడతాం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేష్ పటేల్ కులాచారి
సుభాష్‌నగర్: మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని, మేయర్ పీఠంపై ఇందూరు బిడ్డనే కూర్చోబెడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి స్పష్టంచేశారు. షబ్బీర్, బషీర్‌ల కుమారులను కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ముగిసిన అ నంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ఓటరు జాబితాలో అవకతవకలపై బీజేపీ ప్రశ్నించగానే అధికార దుర్వినియోగం, మత రాజకీయాల అసలు స్వరూపం బయటపడ్డా యని విమర్శించారు. బోగస్ ఓట్లు, అక్రమ రాజకీ యాలు, బెదిరింపుల పాలనకు ముగింపు దగ్గర్లోనే ఉందని స్పష్టంచేశారు. ఇందూరు ప్రజల గుండెల్లో బీజేపీ ఉందని, మేయర్ పీఠం మీద కూడా బీజేపీ నే, హిందూ బిడ్డనే ఉంటాడని స్పష్టంచేశారు. మాజీ కార్పొరేటర్లు, నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, తారక్ వేణు, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణ, ఓంసింగ్, సాయివర్ధన్, శ్రీనివాస్, సుధీర్, ఆనంద్, శ్రీకర్, పాల్గొన్నారు.
బీజేపీలో పలువురి చేరిక
సుభాష్‌నగర్: మాజీ కార్పొరేటర్ ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో 4వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, పాంగ్రా మాజీ సర్పంచ్ భీమ్‌సింగ్, ఎల్‌ఐసీ శ్రీనివాస్, తదితరులు తమ అనుచరులతో బీజేపీలో చేరారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో వారికి సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి బీజేపీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. పార్టీలో చేరారు.


