కలెక్టర్‌ను కలిసిన అధికారులు, విద్యార్థినులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠిని సోమవారం వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి పరిచయం చేసుకున్నారు. అలాగే కోటగల్లి, నాందేవ్‌వాడ ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థులు గ్రీటింగ్‌లను అందించారు.
సిరికొండ: జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని నీరు గారేలా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మండల కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇట్టెంపేట రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధిహామీ పథకం స్థానంలో తెచ్చిన వీబీ జీ రాంజీ మిషన్‌ను రద్దు చేయాలన్నారు. సొసైటీ హాల్‌లో నిర్వహించే సమావేశాన్ని అన్ని వర్గాల శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సుభాష్‌నగర్: నగరంలోని పెరిక భవన్‌లో సోమవారం పెరిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మైదం రాజన్న, అసోసియేట్ అధ్యక్షుడిగా గొర్ల లింగం, కార్యదర్శిగా అల్లే రమేష్, ఉపాధ్యక్షులుగా విశ్వనాథం, కోశాధికారిగా వేణు ఎన్నికయ్యారు. జిల్లాలోని 48 గ్రామాల పెరిక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ..పెరిక సంఘం సభ్యుల అభ్యునతికి పాటుపడతానని అన్నారు.
సిరికొండ: సర్పంచ్‌ల ఫో రం మండలాధ్యక్షుడిగా దు ప్యతండా సర్పంచ్, డీసీసీ కార్యదర్శి మాలావత్ చందర్‌నాయక్ ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో అతడిని సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బా కారం రవి, డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, నర్సారెడ్డి, పిట్ల నర్సింగ్, చల్ల రాజారెడ్డి, దేగాం సాయన్న, రవినాయక్, సర్పంచ్‌లు మల్లేష్‌యాదవ్, లతభాస్కర్‌రెడ్డి, పిట్ల వనిత పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన అధికారులు, విద్యార్థినులు
కలెక్టర్‌ను కలిసిన అధికారులు, విద్యార్థినులు


