బాలిక అదృశ్యం
వర్ని: మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ నెల 1న గుడికి వెళ్లి వస్తానని వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.
రెంజల్(బోధన్): మండలంలోని నీలా క్యాంపులో కుక్కలు స్వైరవిహారం చేశా యి. సోమవారం ఇంటి ముందు పనులు చేస్తున్న ఐదుగు రు మహిళలపై దాడి చేశాయి. బాధితులను వెంటనే ప్రభు త్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కుటుంబీకులు తరలించారు. బాధితుల్లో వృద్ధులు ఉన్నారు. అయితే, కుక్కలకు ఇటీవల వైరస్ సోకడంతో వింతగా ప్రవర్తిస్తున్నాయని పలు గ్రా మాల ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు, గ్రా మ పంచాయతీ పాలకవర్గ సభ్యులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని కందర్‌పల్లి నుంచి రాచూర్ వెళ్లే రోడ్డులో సోమవారం కంకర టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. రాచూర్ రోడ్డు నిర్మాణ పనుల కోసం కంకర తీసుకొచ్చిన టిప్పర్ లోడ్ ఖాళీ చేయడానికి రివర్స్‌లో వెళ్తుంది. రాచూర్ గ్రామానికి చెందిన కల్లప్ప (58) బైక్ పై కందర్‌పల్లి వైపు వస్తున్నాడు. రీవర్స్‌లో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ బైక్‌పై వస్తున్న కల్లప్పను గమనించకుండా ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై మోహన్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.


