డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజు 141 మందికి శిక్ష
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వారిలో 141 మందికి సోమవారం జిల్లాలోని వివిధ కోర్టులు శిక్షలు, జరిమానాలు విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి 2 రోజుల జైలు, మరో 12 మందికి 1 రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. భిక్కనూర్ పీఎస్ పరిధిలో ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష రూ.వెయ్యి జరిమానా, దోమకొండ పరిధిలో ఒకరికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా, సదాశివనగర్ పరిధిలో ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించబడిందన్నారు. కామారెడ్డి పీఎస్ పరిధిలో 73 కేసులకు రూ.76 వేలు, దేవునిపల్లి పరిధిలో 11 కేసులకు రూ.11 వేలు, మాచారెడ్డి పరిధిలో 5 కేసులకు రూ.5 వేలు, రామారెడ్డి పరిధిలో 2 కేసులకు రూ.2 వేలు, భిక్కనూర్ పరిధిలో 18 కేసులకు రూ.20 వేలు, దోమకొండ పోలీస్ పరిధిలో 5 కేసులకు రూ.6 వేలు, బీబీపేట పరిధిలో 4 కేసులకు రూ.4 వేలు, సదాశివనగర్‌లో 6 కేసులకు రూ.7 వేలు చొప్పున జరిమానాలు విధించారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 141 కేసులు నమోదు కాగా, మొత్తం రూ.1.48 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు.


