రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు భోజారాం సోమవారం తెలిపారు. గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన ఆశ్రమ పాఠశాలల జోనల్ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 7, 8, 9 వ తేదీలలో ఏటూరు నాగారంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడాపోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు బిట్టు, చరణ్ సింగ్, రాంప్రసాద్, అజయ్ కుమార్, నిఖిల్, లోకేశ్, ఆనంద్‌లను హెచ్‌ఎం భోజారాం, ఫిజికల్ డైరెక్టర్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీనివాస్ జాతీయస్థాయి స్కూ ల్ గేమ్స్ అండర్ –17 కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు రాజ్ కుమా ర్ తెలిపారు.ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వ రకు ఖమ్మం జిల్లాలోని ఏడువుల బయ్యారంలో జరగనున్న పోటీల్లో శ్రీనివాస్ పాల్గొననున్నారు.ఎంపికై న విద్యార్థిని సర్పంచ్ అనిత చింటూ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు భూమేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.
● రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల నిధులను వ్యవసాయ రంగానికి ఖర్చు చేస్తోందని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి నుంచి సబ్సిడీపై వ్యవసా య యంత్ర పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రెండ్రోజుల క్రితం అసెంబ్లీలోని చాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వ్యవసాయంపై చర్చించినట్లు తెలిపారు. కమిషన్ పనితీరు బాగుందని సీఎం ప్రశించారని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు.
ఖలీల్‌వాడి: కలెక్టరేట్‌లో ఇటీవల బా ధ్యతలు స్వీకరించి న కలెక్టర్ ఇలా త్రి పాఠిని సోమవారం డీఈవో పార్శి అశోక్, ఐఎల్‌ఏ తిరుపతి కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం విద్యారంగానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక


