ఊరెళ్తున్నారా? అయితే జాగ్రత్త!
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల దొంగల అలజడి కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో రెండు ఏటీఎంల దోపిడీ, మరో ఏటీఎం, బంగారు దుకాణంలో లూటీకి యత్నించిన విషయం తెలిసిందే. అయితే, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికి, రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారని, వారిపై నిఘా పెడుతున్నామన్నారు.
● ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి.
● ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దు.
● డోర్స్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలి.
● సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలి.
● సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు గమనించాలి.
● అపరిచిత వ్యక్తులు వస్తే వారి పోలీసులకు సమాచారం అందించాలి.
● ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలి.
● మహిళలు, వృద్ధులు ‘అపరిచితులు‘ సమాచారం పేరుతో వస్తే నమ్మొద్దు.
● కాలనీల వారీగా గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకోవాలి.
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో
ప్రజలకు పోలీసు శాఖ సూచనలు
సంబంధిత పోలీస్ స్టేషన్‌కు
సమాచారం ఇవ్వాలి
సీపీ సాయిచైతన్య


