మైనారిటీ స్కూల్‌లో దారుణం
● ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లు
● 8 మంది విద్యార్థులకు టీసీ జారీ
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యా ర్థులు పదో తరగతి విద్యార్థిపై శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. నలుగురు ఫస్టియర్, నలుగురు సెకండియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని గుర్తించి సోమవారం వారి తల్లిదండ్రులను పిలిపించి ప్రిన్సిపల్ స్వామి టీసీ ఇచ్చి పంపించారు. పదో తరగతి విద్యార్థి.. ఐదో తరగతి విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఇంటర్ విద్యా ర్థులు శనివారం రాత్రి దాడి చేశారు. కొట్టిన వీడి యో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విష యమై ప్రిన్సిపల్ స్వామి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. సోమవారం విచారణ చేపట్టిన అధికారులు పైఅధికారులకు నివేదిక అందించారు. వారి ఆదేశాల మేరకు 8 మంది ఇంటర్ విద్యార్థులకు టీసీ జారీ చేశారు. వేధింపులకు పాల్పడిన పదో తరగతి విద్యార్థిపై విచారణ చేపట్టి పాఠశాల నుంచి తొలగిస్తామని ఆర్‌ఎల్‌సీ జిల్లా అధికారి బషీర్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు టీసీలు ఇవ్వడంతో తోటి విద్యార్థులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. విద్యార్థిపై దాడి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం నేరమని, పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామంటూ విజిలెన్స్ అధికారులు హమీద్, అహ్మద్, ఆర్‌ఎల్‌సీ బషీర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.


