ఆధునిక సేద్యాన్ని ప్రోత్సహించాలి
సుభాష్‌నగర్: జిల్లాలో ఆధునిక సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవసరమైన తోడ్పాటునందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశానికి పర్సన్ ఇన్‌చార్జి హోదాలో కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు, అభ్యుదయ రైతులు హాజరయ్యారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తున్న తోడ్పాటు, వివిధ కార్యక్రమాల అమలు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ప్రత్యేకతను కలిగి ఉన్న జిల్లా ఘనతను మరింత ఇనుమడింపజేసేలా సాగు రంగానికి ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు సూ చించారు. ముఖ్యంగా పసుపు రైతులకు పంట సా గు విషయంలో వెన్నుదన్నుగా నిలుస్తూ, ఆధునిక యంత్ర సామగ్రిని వినియోగిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. యూరియా విషయంలో అక్కడక్కడా రైతుల్లో నెలకొని ఉన్న అపోహల ను దూరం చేసేందుకు అభ్యుదయ రైతులు కృషి చే యాలని సూచించారు. మోతాదు మేరకే యూరి యా వినియోగించేలా విస్తృత స్థాయిలో అవగాహ న కల్పించాలన్నారు. యూరియా, ఎరువుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, దళారుల ప్రమేయం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. రైతులు యాప్‌ను వినియోగించుకునేలా చూడాలన్నారు. డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ, సీఈవో నాగభూషణం, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సునీల్, ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, సహకార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సాగు రంగంలో జిల్లా ఘనతను
మరింత ఇనుమడింపజేయాలి
సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి
రైతులు ఆందోళన చెందొద్దు
సాంకేతిక కమిటీ సమావేశంలో
కలెక్టర్ ఇలా త్రిపాఠి


