ప్రజావాణిపై నమ్మకంతో వస్తారు..
నిజామాబాద్ అర్బన్: తమ సమస్యలు పరి ష్కా రమవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారని, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను అప్పటికప్పుడే ప రిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 70 ఫిర్యా దులు అందాయి. ప్రజావాణి అనంతరం అధికారులతో కలెక్ట ర్ మాట్లాడారు.
రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న తరహాలోనే జిల్లా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆన్‌లైన్ విధానాన్ని అవలంబిస్తామని అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా శాఖ ల జిల్లా అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావొద్దని, కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయి విషయాలు తెలుసు కునేందుకు ప్రజావాణి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారు లు జిల్లా ప్రగతిలో క్రియాశీల పాత్ర పోషించాలని అన్నారు. పథకాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని మార్గనిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు.


