పింఛన్‌లు పెంచలేని నిస్సహాయ స్థితి
● అసెంబ్లీలో ప్రభుత్వంపై మండిపడ్డ
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
సుభాష్‌నగర్: లబ్ధిదారులకు పింఛన్‌ను పెంచుతామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఒక్కరికి కూడా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇవ్వలేని నిస్సహాయ స్థితి లో ప్రభుత్వం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. పింఛన్‌ల అంశంపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, బీడీ కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు తమ పింఛన్‌లను ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందోన ని ఎదురు చూస్తున్నారన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని ఆయన అన్నారు.


