అందరికీ మాఫీ ఏదీ..?
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన రైతు మాదాం నర్సయ్యకు పాలెంలోని ఎస్‌బీఐలో పంట రుణం మాఫీ అవుతున్నట్లు గతంలో మెస్సేజ్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. ఇంకా నిధులు జమ కాలేదని, సొమ్ము ప్రభుత్వం నుంచి వస్తేనే రుణమాఫీపై తాము ఏమైనా చెప్పగలమని బ్యాంకు అధికారులు జవాబిచ్చారు. ఆరు నెలలుగా బ్యాంకులో, వ్యవసాయ శాఖ కార్యాలయంలో అడుగుతున్నా రుణమాఫీపై ఎక్కడ కూడా స్పష్టమైన సమాచారం నర్సయ్యకు దొరకడం లేదు. ఒక వేళ తాను రుణాన్ని రెన్యువల్ చేసుకుంటే మా ఫీ సొమ్ము జమ చేస్తారో లేదోనని వడ్డీ మాత్రమే చెల్లించి ఊరుకున్నాడు. జిల్లాలో ఇలా ఎంతో మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో వచ్చినా బ్యాంకులో సొమ్ము జమ కాకపోవడంతో రుణమా ఫీ వర్తించలేదు. నాలుగు విడతల్లో రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా నిధులను విడుదల చేయకపోవడంతో రైతులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసినా ప్రభుత్వం ఆచరణలో విఫ లం కావడంతో రైతులకు మొండిచేయి ఎదురైంది.
ప్రభుత్వం మోసం చేసింది
రుణమాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఎంతో మంది రైతులకు అర్హత ఉన్నా పంట రుణం మాఫీ కాకపోవడంతో వడ్డీ భారం మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే మోసం చేస్తే రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి.
– ఏనుగు రాజేశ్వర్, రైతు, మోర్తాడ్
నిధులు ఇవ్వాలి
రుణమాఫీకి ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కొద్ది మందికే నిధులు విడుదల చేసి మిగతా వారిని మోసం చేయడం తగదు. అర్హులైన ప్రతి రైతుకు రూ.2లక్షల వరకు రుణం మాఫీ చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.
– పాపాయి పవన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ౖచైర్మన్, మోర్తాడ్
జిల్లా వ్యాప్తంగా 97,696 మందికే లబ్ధి
జిల్లా వ్యాప్తంగా 1,00,612 మంది రైతులకు నాలుగు విడతల్లో రూ.782.30 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి 97,696 మంది రూ.755 కోట్ల 29 లక్షల, 40వేలు మాత్రమే రైతుల ఖాతా ల్లో జమ చేశారు. మరో 2,916 మంది రైతు ల వివరాలు సరిగా లేకపోవడంతో నిధులు జమ కాలేదు. ఫలితంగా రూ.27.01 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. వాస్తవానికి జిల్లాలో రుణమాఫీకి అర్హత ఉన్న రైతులు 1.50లక్షల మందికి పైగానే ఉన్నారు. మొదట్లో ఒక్కో రైతుకు రూ.2లక్షల వరకు పంట రుణం మాఫీ అని ప్రకటించగా రుణమాఫీ అమలు చేసే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు అని మార్గదర్శకాలు మార్చా రు. ఒక ఇంటిలో ఎంత మందికి రుణం ఉన్నా.. ఎంత బకాయి ఉన్నా రూ.2లక్షల వ రకు రుణ మాఫీ వర్తింపజేస్తామని ప్రభు త్వం స్పష్టం చేసింది. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకున్నా రుణమాఫీకి అర్హత ఉండి లబ్ధి పొందని రైతుల సంఖ్య 50వేలకు పైగానే ఉంటుందని అంచనా.
అసంపూర్ణంగా రైతు రుణమాఫీ
జాబితాలో పేర్లున్నా.. ఖాతాల్లో నిధులు జమ కాలేదు
అన్నదాతకు తప్పని నిరీక్షణ
నాలుగు విడతల్లో కొద్ది మందికే ఊరట
అందరికీ మాఫీ ఏదీ..?
అందరికీ మాఫీ ఏదీ..?


