రాజకీయ పార్టీల సమావేశంలో రసాభాస
సుభాష్‌నగర్: ముసాయిదా ఓటరు జాబితాపై నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్‌కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతున్న క్రమంలో ‘ఇందూరు మున్సిపాలిటీ’ అనడంపై ఎంఐఎం అ భ్యంతరం వ్యక్తం చేసింది. నిజామాబాద్ అనాలని అనడంతో ఎంఐఎం, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రెండు పార్టీల నాయకులను కమిషనర్ దిలీప్‌కుమార్ సముదాయించే ప్రయ త్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇద్దరు చొప్పున ఆయా పా ర్టీల ప్ర జాప్రతినిధులు తన చాంబర్‌లోకి రావాలని చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ చోటుచేసుకోకుండా బందోబస్తు చేపట్టారు. అనంతరం కమిషనర్ చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కొనసాగించారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఓటరు జాబితా ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు దినేశ్ పటేల్ కులాచారి, న్యాలం రాజు, బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, సిర్ప రాజు, రమేశ్‌బాబు, స మీర్ అ హ్మ ద్, రాజుగౌడ్ తదితరులు సూచించారు. బీఎల్‌వోల సేవలతోపాటు అవసరమైతే బూత్ లెవల్ నాయ కులు సహకారం అందిస్తారన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీ య పార్టీల ప్రతినిధులు విలువైన సూచనలు చేశారని కమిషనర్ తెలిపారు. వాటని పరిగణనలోకి తీసుకుని తుది ఓటరు జాబితా రూపొందిస్తామన్నారు.
ఇందూరు అనడంపై
ఎంఐఎం అభ్యంతరం..
బీజేపీ నాయకులతో వాగ్వాదం.. పోటాపోటీ నినాదాలు
ఇరుపక్షాలను సముదాయించిన
కమిషనర్ దిలీప్‌కుమార్
రాజకీయ పార్టీల సమావేశంలో రసాభాస


