జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: జిల్లా పాలనాధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్.భరతలక్ష్మితోపాటు పోలీస్ కమిషనర్ సా యి చైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూలమొక్కను అందజేశారు. జిల్లా స్థితిగతులు, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో చేపట్టే కార్యక్రమాలపై కొద్దిసే పు చర్చించారు. అనంతరం కమిషనరేట్‌లో సీపీని కలిసి బొకే అందించారు.
ప్రత్యేక సొసైటీ
ఏర్పాటు చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నందిపేట మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న వెల్మల్ కేంద్రంగా ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘం (సొసైటీ) ఏ ర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు సోమ వా రం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష నాయకులు ఆధ్వ ర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్‌కు వచ్చారు. వెల్మల్‌కు సరిహద్దు గ్రామాలైన ఆంధ్రనగర్, కౌల్‌పూర్, రైతుఫారం, జోజిపేట గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానంతో కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని కోరా రు. 4 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న తమ గ్రామాన్ని అయిలాపూర్ సొసైటీ నుంచి వేరు చేయాలని వినతిపత్రంలో పేర్కొ న్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సర్పంచ్ దేవేందర్, ఉప సర్పంచ్ ఇసపల్లి మహేశ్, మాజీ సర్పంచ్ మచ్చర్ల పెద్ద గంగారాం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, గోజూరి నరేందర్, కిషన్, జీఆర్ రాజేందర్, మల్లేశ్, శ్రీధర్, శ్రీనివాస్ ఉన్నారు.
దూరవిద్యలో
సెమిస్టర్ పరీక్షలు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళా శాల ప్రాంగణంలో కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ – 1 ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ – 3 ప్రయోగ, తృతీయ సంవత్సరం సైన్స్ వి ద్యార్థులకు సెమిస్టర్ – 5 తరగతులు ఈ నె ల 6 నుంచి ప్రారంభమవుతాయని తెలి పా రు. 80 శాతం అటెన్‌డెన్స్ లేనిపక్షంలో ప్రాక్టికల్స్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
1,507 టీఎస్ ఐపాస్ దరఖాస్తుల ఆమోదం
కామారెడ్డి క్రైం: టీఎస్ ఐపాస్ పథకం కింద పరిశ్రమల ఏర్పాటుకుగాను జిల్లాలో ఇప్పటివరకు 1,552 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 1,507 ఆమోదించామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పారిశ్రామిక ప్రో త్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్


