డుమ్మాలకు చెక్!
● ఐకేపీ ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో
ముఖ గుర్తింపు హాజరు
● సోమవారం నుంచే అమలులోకి వచ్చిన కొత్త విధానం
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో డుమ్మాలు కొట్టే ఉద్యోగులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సెర్ప్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హాజరు రిజిస్టర్లకు స్వస్తి చెప్పి ఆన్‌లైన్ హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ‘టీఫేస్ ఎఫ్‌ఆర్‌ఎస్’ యాప్‌ను రూపొందించగా సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. దీనిని ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ఉద్యోగులకు అవగాహన కూడా కల్పించారు. తొలి రోజు విజయవంతంగా 85 శాతం ఉద్యోగులు ముఖగుర్తింపు ద్వారా ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేసుకున్నారు. ఐకేపీ విభాగంలో అన్ని కేడర్‌ల ఉద్యోగులు కలిపి 200 మందికి పైగా ఉన్నారు. ఇది వర కు జిల్లా, మండల కార్యాలయాల్లో హాజరు రిజిస్టర్ ద్వారా అటెన్‌డెన్స్ నమోదు చేసుకునే వా రు. దీని ద్వారా చాలా మంది ఉద్యోగులు ఇంటి ప ట్టున ఉంటూ అధికారులను మేనేజ్ చేస్తూ హాజరు వేసుకుని జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆఫీసులకు రాకుండా సొంత పనులు చేసుకోవడంపై సెర్ప్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఉద్యోగులను క్రమశిక్షణలో పె ట్టేందుకు సెర్ప్ ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తెచ్చారు. యాప్‌ను ఉద్యోగులు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయిన తరువాత హాజరు వే సుకోవాలి. ఉదయం 10గంటలకు ఒకసారి లాగినై ఎక్కడ ఉన్నారో లొకేషన్ పె ట్టాలి. మళ్లీ సాయంత్రం 5గంటలకు ఒకసారి విధు లు ముగించుకున్నట్లుగా నమోదు చేయాలి. సెలవులు సైతం యాప్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగుల హాజరును పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి అధికారికి లాగిన్ ఇచ్చారు. ఐకేపీలో ఏపీడీతోపాటు ఆరుగురు డీపీఎంలు, 30 మంది డీపీఎంలు, 165 మంది సీసీలు, పది మంది అడ్మిన్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇక నుంచి ఉద్యోగులు కచ్చితంగా యాప్ ద్వారానే హాజరు వేసుకోవాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ ‘సాక్షి’కి తెలిపారు.


