నందిపేట్‌కు ఆర్టీసీ డిపో మంజూరు చేయండి
ఆర్మూర్ : నందిపేట్ మండల కేంద్రంలో ఆర్టీసీ డిపోను మంజూరు చేయాలని లేదా డిపో స్థలాన్ని ఇతర అవసరాలకు వాడుకు నే విధంగా ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ఖుద్వాన్‌పూర్‌లో బీసీ, ఎస్సీ వసతి గృహాలు, ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో ఉన్న మైనారిటీ ప్రభుత్వ పాఠశాలకు భవనాలు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కంఠం ప్రభుత్వ పాఠశాల కోసం రూ.5 లక్షలు కేటాయించాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ డిపో సాధ్యాసాధ్యాలపై అధికారులతో మాట్లాడి అవసరం మేరకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నిజాంసాగర్ కాలువల మరమ్మతులకు..
ఆర్మూర్: నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. కాలువలు శిథిలమవ్వడంతో ఆర్మూర్ నియోజకవర్గానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నీరందడం లేదని, సుమారు 35 కిలో మీటర్ల మేర కాలువల మరమ్మతులకు రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.


