ఐడియా.. అదరహో
వ్యవసాయం చేసే రైతులంతా ఈ చిత్రాన్ని చూసి మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వేసిన రోడ్లను కాపాడుకోవడానికి డొంకేశ్వర్‌లో పలువురు రైతులు మంచి ఆలోచన చేశారు. పొలాలను దమ్ము చేసే కేజ్‌వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లు పాడవకుండా ట్రాలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక రైతు కేజ్‌వీల్ ట్రాక్టర్‌ను ట్రాలీలో ఎక్కించి మరో ట్రాక్టర్ సహాయంతో కావాల్సిన చోటికి తీసుకెళ్తున్న చిత్రాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో తీసింది. గ్రామాల్లోని రైతులందరూ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే బాగుటుందని ఎస్సై శ్యామ్‌రాజ్ కోరారు. కేజ్‌వీల్ ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. – డొంకేశ్వర్(ఆర్మూర్)


