టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ నాయకుల
ఆర్మూర్ : కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను ఆదివారం హైదరాబాద్ లో కలిశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణం లో రాజకీయ పరిస్థితుల పై చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ ఇట్టేం జీవన్, నాయకులు ఖాందేష్ శ్రీనివాస్, పవన్, పూల నర్సయ్య, విటోభ శేఖర్, రమేష్ తదితరులున్నారు.


