పండితులకు సన్మానం
నిజామాబాద్ రూరల్: తెలుగు వెలుగు సమా ఖ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని గీతభవనంలో ఐదుగురు పండితులను ఘనంగా సన్మానించారు. సమాఖ్య ప్రధా న కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పండితు లు గోసం దత్తుశాస్త్రి, మనోహరశాస్త్రి, చంద్ర శేఖర్‌శర్మ, మారుతిజోషి, ప్రమోద్‌లను శాలు వ, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వీపీ చందన్‌రావు, సమాఖ్య అధ్యక్షులు ప్రభాకర్, ప్రకాశ్, లక్ష్మన్, ఆశోక్‌శర్మ తదితరులున్నారు.
నిజామాబాద్ రూరల్: గుండె సంబంధిత వ్యాధుల నివారణకు వాకింగ్, శారీరక వ్యాయామం, యోగా చేయడం మంచిదని ప్రముఖ కార్డియాలజిస్ట్ సందీప్‌రావు తెలిపారు. ఆదివారం వినాయక్‌నగర్‌లో బస్వా పార్క్ యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు సందీప్‌రావును సన్మానించారు. కార్యక్రమంలో గంగాధర్, మల్లేశ్‌రెడ్డి, మోహన్ కుమార్, రామ్మోహన్‌రావు, భూమేశ్వర్, దీవెన, మహేందర్, సత్యనారాయణ, శంకర్ తదితరులున్నారు.
ఖలీల్ వాడి: త్రిభాషలైన తెలుగు, హిందీ, ఉర్దూలో విద్యార్థులను తీర్చిద్దాలని డీఈవో పార్శి అశోక్ తెలిపారు. ఆదివారం నగరంలోని ఆర్యనగర్ లో డీఈవో నివాసంలో రాష్ట్రీ య ఉపాధ్యాయ పండిత పరిషత్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఏ, బీ,సీ గ్రేడులుగా విభజించుకుని సీ గ్రేడ్ కలిగిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీలుల్లా, ప్రధాన కార్యదర్శి రమణచారి, కోశాధికారి సతీష్ వ్యాస్, రాష్ట్ర బాధ్యులు గంట్యాల ప్రసాద్, పెంట శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బి.ప్రవీణ్ కుమార్, దేవన్న, శ్రీమన్నారాయణ చారి, అబ్దుల్ వహీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నగర సమస్యలపై పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరిస్తున్నట్లు పెన్షనర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి కే రామ్మోహన్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సుభాష్‌నగర్‌లోగల పెన్షనర్స్ భవన్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని, ఆవిష్కరణ కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.
పండితులకు సన్మానం
పండితులకు సన్మానం


